● కొత్తగా రైల్వే లైన్ల కోసంజిల్లావాసుల ఎదురు చూపులు ● బ
●
రైల్వే లైన్ వస్తే అభివృద్ధి
బోధన్ నుంచి కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు ప్రతిపాదనలు సర్వేకే పరిమితమైంది. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయలేదు. సర్వే చేసి నిధుల మంజూరుపై ఆశలు ఊరిస్తున్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ప్రజారవాణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వివక్ష చూపకుండా కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలి.
: బాలయ్య,
మహదేవుపల్లి, కల్హేర్ మండలం
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
రైల్వే లైన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. బోధన్–బీదర్, బోధన్–జోగిపేట్ మీదుగా హైదరాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేస్తాం. గతంలో ఎంపీగా తాను కృషి చేయడంతో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తోటి ఎంపీలతో కలసి రైల్వే లైన్ సాధన కోసం పనిచేస్తాం. ప్రజల ఆశలు నెరవేర్చేందుకు ఎల్లప్పుడు శ్రమిస్తా.
సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల ప్రజలు రైలు కూత కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమ ప్రాంతం మీదుగా కొత్త రైల్వే లైన్ల కోసం ఈసారైనా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మాత్రం ఈ రైల్వే లైన్లకు నిధులు కేటాయించపోతుడటంతో ఈ జిల్లాల ప్రజలు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. ప్రజారవాణా, అభివృద్ధికి రైల్వే సదుపాయం కీలకం కాగా...ప్రతీసారి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన నిధుల కేటాయింపుల్లో మాత్రం మోక్షం లభించడంలేదు.
13 ఏళ్లక్రితమే ప్రతిపాదనలు...
బోధన్–బీదర్, బోధన్–జోగిపేట్ కొత్త రైల్వే లైన్ల కోసం దాదాపు 13 ఏళ్ల క్రితం గత యూపీఏ ప్రభుత్వ హాయాంలో ప్రస్తుత జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ కృషి మేరకు ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో బోధన్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ, వడ్డెపల్లి, కల్హేర్ మండలం మహదేవుపల్లి, బాచేపల్లి, నారాయణఖేడ్ మీదుగా రైల్వే లైన్ కోసం సర్వే చేశారు. లైన్ కోసం హద్దులు ఏర్పాటు చేశారు. మరో రైల్వే లైన్ కోసం బోధన్ నుంచి బాన్స్‌వాడ, పిట్లం, కల్హేర్ మండలం బీబీపేట్, రాక్యల్, నారాయణఖేడ్ మీదుగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసిన ఏళ్ల తరబడిగా నిధుల కేటాయింపులు జరగలేదు. ఆరు నెలల క్రితం రెండు మార్గాల్లో తిరిగి సర్వే నిర్వహించారు. కొత్తగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధుల కేటాయింపు గురించి కేంద్ర ప్రభుత్వం ఊసేత్తలేదు. రైల్వే లైన్ల కోసం నిధులు దక్కకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు.
కొత్త రైల్వే మార్గంతో అభివృద్ధి..
కొత్తగా రైల్వే మార్గం ఏర్పాటు జరిగితే ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని దెగ్లూర్ వరకు సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవే నిర్మించారు. జాతీయ రహదారి ఏర్పాటు కారణంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. హైవే ప్రాంతంలో ఉన్న భూముల విలువ పెరిగింది. ఏళ్ల తరబడిగా ఊరిస్తున్న రైల్వే లైన్ల ఏర్పాటు జరిగితే బాన్స్‌వాడ, నారాయణఖేడ్, జోగిపేట్ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఎంపీ సురేశ్‌షెట్కార్ మరింత కృషి చేయాలని కోరుతున్నారు.
● కొత్తగా రైల్వే లైన్ల కోసంజిల్లావాసుల ఎదురు చూపులు ● బ
● కొత్తగా రైల్వే లైన్ల కోసంజిల్లావాసుల ఎదురు చూపులు ● బ
Comments
Please login to add a commentAdd a comment