షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెలు దగ్ధం
సంగారెడ్డి క్రైమ్: పట్టణంలోని రెవెన్యూ కాలనీలో శనివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఏకంగా 14 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. పట్టణ పోలీస్ సేష్టన్ ఫరిధిలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మునిపల్లి మండలం కంకోల్‌కు చెందిన గుజ్జుల జెట్టయ్య గత 12 ఏళ్లుగా రెవెన్యూ కాలనీలోని రాజీవ్‌గృహకల్ప బిల్డింగ్ ఆవరణలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఇతని నివాసం పక్కనే 13 కుటుంబాలు కూడా గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటి నుంచి చెత్తను సేకరించడం వృత్తి. ఈ నెల 8న శనివారం నాడు కంకోల్ ఉండే తమ బంధువుల ఇంటివద్ద జరిగిన ఓ శుభకార్యానికి అందరూ కలసి వెళ్లారు. అదేరోజు రాత్రి పది గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ గుడిసెల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు మిగతా గుడిసెలకు కూడా అంటుకోవడంతో మొత్తం 14 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు గమనించి అగ్నిమాపకశాఖకు సమాచారమందించగా...వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ అగ్నిప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రాణం నష్టమేమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజ్జుల జెట్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులుకోరుతున్నారు.
రోడ్డున పడ్డ 14కుటుంబాలు
ప్రభుత్వం ఆదుకోవాలని
బాధితుల విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment