విద్యార్థులు కష్టపడితేనే భవిష్యత్తు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి రూరల్ : విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన శ్రీ వైష్ణవి స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తయారు చేయాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదువుకోవడానికి పంపిస్తారని వారి ఆశలు నెరవేరే విధంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, వైష్ణవి, స్కూల్ చైర్మన్ విజయ్ ,మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, రామప్ప, జలంధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూతోనే
కార్మికులకు న్యాయం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు
పటాన్‌చెరు టౌన్: కార్మికుల కష్ట సుఖాల్లో ఎరజ్రెండా అండగా ఉంటుందని, సీఐటీయూ అంటేనే కార్మికులకు ఒక భరోసా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సీఐటీయూలో చుక్కా రాములు సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కిర్బీ పరిశ్రమలో కూడా కార్మికులకు అనేక చట్టపరమైన సౌకర్యాలు సీఐటీయూ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని భరోసానిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కె.రాజయ్య, యూనియన్ నాయకులు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దారెడ్డి, రామకృష్ణకు
ఎక్సలెన్సీ అవార్డు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ అవార్డు 2025కు జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డి, సదశివపేట మండలం నిజాంపూర్(కె) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు రామకృష్ణ ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మహిళా కో ఆపరేటివ్ చైర్ పర్సన్ బండారు శోభారాణి, దైవజ్ఞ శర్మ ఈ పురస్కారాలను వీరికి అందజేశారు. విద్యా, సామాజిక రంగాల్లో, మహిళా సాధికారిత అంశంలో విశేష కృషికిగాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వ్యవస్థాపక చైర్మన్ భానుచందర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల, వల్లూరి ఫౌండేషన్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment