విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్ మండలం సంగం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.60 వేలు మంజూరుకాగా అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆయన ఖేడ్‌లోని తననివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వైద్యరంగానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కాగా, మనూరు మండలం దన్వార్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సర్పంచ్ దిగంబర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment