కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
కౌడిపల్లి(నర్సాపూర్): కడుపునొప్పి భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఈసంఘటన మండలంలోని మహమ్మద్‌నగర్‌లో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)ని మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎదుల అనిల్‌కుమార్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. కొన్ని నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుంది. పలుమార్లు చికిత్స చేయించుకున్న తగ్గలేదు. దీంతో ఆదివారం భర్త, మామ పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయలో భర్త ఇంటికి రాగా తలుపులు పెట్టి ఉన్నాయి. పిలిచినా పలకకపోవడంతో తలుపులు తొలగించి చూడగా భార్య విగతజీవిగా కనిపించింది. 108లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి నాగప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment