ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా సాగు
మూడు నెలల పంట కావడంతో రైతులు ఆలుగడ్డ పంట సాగువైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఈ పంట సాగవుతోంది. సుమారు 8వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే ఒక్క జహీరాబాద్ ప్రాంతంలోనే 80 శాతం మేర పంటను రైతులు సాగు చేసుకుంటున్నారు. సంగారెడ్డిలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలతో పాటు పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాకు చెందిన రైతాంగానికి ఎంతో సౌలభ్యం అవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఆలు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment