చెట్టును ఢీకొన్న కారు..
దంపతులకు తీవ్ర గాయాలు
కొండపాక(గజ్వేల్): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈఘటన కొండపాక గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి సందీప్, అనిలా దంపతులు కారులో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయానికి దర్శనం కోసం వెళ్తున్నారు. ఈక్రమంలో కొండపాక శివారులోకి రాగానే కారు అదుపు తప్పి రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది, సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment