వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చికిత్సపొందుతూ మృతి
వర్గల్(గజ్వేల్): కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ మనోవేదనతో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం వర్గల్ మండలం సీతారాంపల్లిలో జరిగింది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ తూప్రాన్ వెంకటేశం(42)కు భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంవత్సరం క్రితం పెద్ద కూతురు పూజ పెండ్లికి రూ. 2 లక్షల వరకు అప్పుచేశాడు. అప్పు ఎలా తీర్చాలంటూ తరచూ బాధపడేవాడు. అదే వేదనతో ఆదివారం ఉదయం ఇంటి వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే అతనిని కుటుంబీకులు గజ్వే ల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment