నేడు టెంకాయల వేలంపాట
రాయికోడ్(అందోల్): రాయికోడ్‌లోని వీరభద్రేశ్వర ఆలయ టెంకాయల దుకాణం వేలంపాటను సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప ఒక ప్రకటనలో ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉ.11.30 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందన్నారు. వేలంపాటలో రూ.10 వేలను దరావత్తు చెల్లించిన వారు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. టెంకాయల దుకాణం రెండు సంవత్సరాలు నిర్వహణకు పాట ఉంటుందన్నారు.
నార్సింగిలో
గ్యాస్ లీకై అగ్నిప్రమాదం
చిన్నశంకరంపేట(మెదక్): గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి ఆగ్నిప్రమాదం జరిగిన సంఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుంది. ఆదివారం నార్సింగి మండల కేంద్రానికి చెందిన మైలారం సిద్ధిరాములు నివాస గృహంలో ఉదయం వంట నిర్వహణకు గ్యాస్ సిలిండర్ ఆన్‌చేసి ముట్టించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబ సభ్యులు మంటలు అర్పేందుకు ప్రయత్నించగా, అగ్నిప్రమాదానికి గురయ్యారు. దీంతో ఇంటి బయటకు పరుగున రాగా, ఇరుగుపొరుగు వచ్చి మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అర్పారు. ఈ సంఘటనలో సిద్ధిరాములు, యశోద, ఎల్లమ్మ, నరేశ్ అగ్నిప్రమాదంలో గాయపడగా, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ సంఘటనలో ఇంట్లోని సామగ్రి కాలిపోవడంతో పాటు ఇల్లు పైకప్పు దెబ్బతిన్నది. సుమారు రూ. 2 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
శివ్వంపేట(నర్సాపూర్): మద్యం మత్తులో బ్యాంకులో చోరీకి పాల్పడుతుండగా గుర్తించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం అర్థరాత్రి మండల పరిధి దొంతి గ్రామ పరిధిలోని తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన ఉన్న యూనియన్ బ్యాంకులో నలుగరు మద్యం మత్తులో బ్యాంకు లోనికి వెళ్లేందుకు కిటికి వద్ద తవ్వకాలు చేస్తుండగా స్థానికులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు పారిపోగా ఒకడు చిక్కాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. మండల పరిధిలోని రెడ్యా తండాకు చెందిన ధన్‌రాజ్‌ని అదుపులోకి విచారించగా మిగితా ముగ్గురు పేర్లు చెప్పాడు. దొంతికి చెందిన కటిక బాలేష్, చండీకి చెందిన ఎంచర్ల పోచయ్య, నల్తురి శ్రీశైలంను అదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ కునాల్ గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మతిస్థిమితం లేని వ్యక్తి
అదృశ్యం
మిరుదొడ్డి(దుబ్బాక): మతి స్థిమితంలేని ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని అల్వాలలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బోయిని పరశురాములు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్ల లచ్చవ్వ, యాదయ్యల కొడుకు మహేశ్‌కు మతిస్థిమితం సరిగా ఉండదు. ఈ క్రమంలో 4వ తేదీ రాత్రి అతడు మూత్ర విసర్జనకని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మహేశ్ తల్లి ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కోనేరులో మునిగి వ్యక్తి మృతి
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి జాతరకు ఆదివారం హైదరాబాదు తిరుమలగిరి జవహర్‌లాల్ నగర్ చెందిన కుటుంబం వచ్చారు. చిత్తడి కర్ణాకర్(14) తన మేనమామ శివకుమార్‌తో కలిసి కోనేరులో స్నానం చేసేందుకు దిగారు. స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాస్తు కర్ణాకర్ కొనేరులో పడ్డాడు. గుర్తించిన మేనమామ అరవడంతో గట్టుపైనున్న పలువురు కోనేరులో నుంచి అతన్ని బయటకు తీసుకొచ్చారు. కొనఊపిరితో ఉన్న అతన్ని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
నేడు టెంకాయల వేలంపాట
నేడు టెంకాయల వేలంపాట
Comments
Please login to add a commentAdd a comment