కనులపండువగా సీతారాముల కల్యాణం
మర్కూక్(గజ్వేల్): ఆలయాల అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాములపర్తి గ్రామంలో ఆదివారం రాములోరి కళ్యాణానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతారామాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామచంద్రమూర్తుల కల్యాణ మహోత్సవం భక్తజనావళికి నేత్రపర్వం చేసింది. యజ్ఞం పూర్ణాహుతి అనంతరం ఆలయ వ్యవస్థాపకుడు హన్మంతరావు దంపతులతో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం పల్లకిసేవ, కోలాటం కార్యాక్రమాలు కొనసాగాయి.
నేడు రథోత్సవం
ఆలయం వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం, 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం, అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ నిర్వాహకుడు తెలిపారు.
కనులపండువగా సీతారాముల కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment