మేడ్చల్‌లో అదృశ్యమై.. వడియారంలో శవమై..
చేగుంట(తూప్రాన్): మేడ్చల్‌లో అదృశ్యమైన వ్యక్తి వడియారం శివారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన లాల్ బహద్దూర్ (49) మేడ్చల్‌లో స్వీట్ తయారీ కేంద్రంలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఈనెల 4వ తేదీన అక్కడి పోలీసులకు బంధువుల ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి వడియారం శివారులోని బైపాస్ సమీపంలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు మేడ్చల్‌లో అదృశ్యమైన లాల్‌బహద్దూర్‌గా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment