రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి
సంతాపం తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ శివారులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణం పారుపల్లి వీధికి చెందిన వ్యాపారవేత్త గట్టు రవీందర్ (61) తన భార్య అరుణతో కలిసి శనివారం రాత్రి రంగీలా దాబా వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యానికి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ నగర్‌కు చెందిన ఓంప్రకాశ్ తన ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్‌లో వస్తూ ఎదురుగా వస్తున్న రవీందర్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రవీందర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య అరుణకు స్వల్వ గాయాలయ్యాయి. ఓంప్రకాశ్‌కు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతు డి కుమారుడి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రవీందర్ మృతి పట్ల మాజీ మంత్రి హారీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్య భవన్ అధ్యక్షుడిగా పనిచేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment