భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి
చేగుంట(తూప్రాన్): భర్త మరణం తట్టుకోలేక భార్య మృతిచెందిన సంఘటన మండలంలోని కర్నాల్‌పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతాకుల అయ్యెల్ల (65) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక మనోవేదనకు గురైన భార్య కొమురవ్వ (60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందింది. భర్త మృతి చెందిన మూడు రోజులకే భార్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
దైవ నామస్మరణతో
ముక్తిమార్గం
హత్నూర( సంగారెడ్డి): దైవ నామస్మరణతో ముక్తి సులభంగా పొందవచ్చని మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. ఆదివారం హత్నూరలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యంత్ర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ నవగ్రహ ప్రతిష్ఠ పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతనతో ఉండాలన్నారు. రామనామం తారక మంత్రం ప్రతి ఒక్కరిని కాపాడుతుందన్నారు.
భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి
Comments
Please login to add a commentAdd a comment