
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
పాపన్నపేట(మెదక్): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా తొగర్‌పల్లి గ్రామానికి చెందిన గౌరెల్లి వినోద్ రెడ్డి(33) అన్నతో కలిసి క్యాటరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 7న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఏడుపాయల్లోని మంజీరా నది రెండో వంతెన సమీపంలో బండ రాళ్లపై మృతదేహామై కనిపించాడు. తలకు బలమైన గాయాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని తమ్ముడి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశాడు.
ఆర్థిక సమస్యలతో
ఉరేసుకొని ఆత్మహత్య
సంగారెడ్డి క్రైమ్: ఆర్థిక సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన శీలనైని నాగేశ్వరావు (43) కొన్నేళ్లుగా పాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డిలోని రాజ్యంపేటకు చెందిన కవితను 2011 ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వ్యాపారంలో నష్టాలు రావడం, దీనికితోడు ఆరోగ్య సమ్యసలు తలెత్తడంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
మనోహరాబాద్(తూప్రాన్): గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామ అంగన్వాడీ రెండో సెంటర్ వద్ద చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. గుర్తించిన టీచర్ కృష్ణవేణి అరవడంతో దుండగుడు పరారైయ్యాడు. టీచర్ మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బాలికతో
అసభ్యకరంగా ప్రవర్తన
నిందితుడికి ఐదేళ్ల జైలు, జరిమానా
చేగుంట(తూప్రాన్): బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన చల్మెడ సురేశ్ అదే గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు. ఈ ఘటన రెండు పర్యాయాలు జరుగడంతో బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 2018 జనవరి నెలలో చేగుంట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు కోర్టులో సాక్షాధారాలను అందించారు. సోమవారం కేసు పూర్వపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద నిందితుడికి రెండు కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ కేసులో పీపీగా రాజ్ కుమార్, లైసనింగ్ ఆఫీసర్‌గా విఠల్ ఇన్వెస్టిగేషన్ అధికారులుగా ఎస్‌ఐ సత్యనారాయణ, సీడీఓగా విఠల్ వ్యవహరించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): వ్యక్తి అదృశ్యమైన ఘటన కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన దీపక్ సింగ్ వికారాబాద్‌లో ఆయుర్వేదిక్ మందులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో నివాసం ఉండే తన అక్క వద్దకు వచ్చాడు. అదే రోజు రాత్రి తిరిగి వికారాబాద్‌కు బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. కానీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు దీపక్ అక్కకు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
క్రేన్ మీద పడి వ్యక్తి మృతి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): క్రేన్ మీద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన మంగళ్ కుమార్ (27) జీవనోపాధి నిమిత్తం రెండేళ్ల కిందట తెల్లాపూర్‌కు వలసొచ్చాడు. తెల్లాపూర్‌లోని ఆకృతి నిర్మాణ సంస్థలో కూలీగా పని చేస్తున్నాడు. సోమవారం నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే క్రేన్ వద్ద పని చేస్తున్నాడు. క్రేన్ సామగ్రిని తీసుకొన వెళ్తే సమయంలో ఒక్కసారిగా క్రేన్ ముందు భాగం మంగళ్‌కుమార్‌పై పడింది. దీంతో అక్కడికక్కడే దుర్మణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment