కఠినమైందన్న భావన ఉండకూడదు
భౌతిక శాస్త్రం కఠినమైనదన్న భావన నుంచి బయటపడాలి. కీలక భావనలపై లోతైన అధ్యయనం చేయడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు నిజ జీవితంలో జరిగే దృగ్విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరగతి గదిలో చేసిన ప్రయోగాలను ప్రాజెక్టులను మరోసారి సాధన చేయాలి. ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకొని కీలక భావనలను జోడించి సొంతంగా జవాబులు రాయడం కోసం ప్రశ్నలను తయారు చేసుకోవాలి. బొమ్మలు గీయడం, కాంతికి, విద్యుత్ వలయాలకు సంబంధించిన అంశాలపై సాధన చేయాలి.
– జంగిటి అనిల్‌కుమార్, భౌతికశాస్త్రం
Comments
Please login to add a commentAdd a comment