46 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్
ఖేడ్ పట్టణంలో 30
నారాయణఖేడ్: పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఖేడ్ పట్టణంలో నిల్వ ఉంచిన గోదాంపై సోమవారం విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. డీఎస్పీ వెంకటేశం కథనం మేరకు.. పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో శివరామ్ అనే బియ్యం వ్యాపారి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తన దుకాణం వెనుక గోదాంలో నిల్వ చేసినట్లు సమాచారం అందింది. దీంతో సీఐ పండరి, ఎస్‌ఐ వెంకటేశం, తహసీల్దార్ ప్రభాకర్‌తో కలిసి దాడి చేశాం. 60 బస్తాల్లో నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకొని ఆర్‌ఐ మాధవరెడ్డి పంచనామా చేసిన అనంతరం పౌరసరఫరాల గోదాముకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
శివ్వంపేటలో 16
శివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి కొత్తపేట చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఆటో ట్రాలీలో రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించారు. అనంతరం సివిల్ సప్లయ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సివిల్ సప్లయ్ జూనియర్ అసిస్టెంట్ సాయికుమార్ వచ్చి 16 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. రాయగిరి అనే వ్యక్తి యశ్వంత్‌రావుపేట్ నుంచి వెల్దుర్తికి బియ్యం తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
46 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్
Comments
Please login to add a commentAdd a comment