కంచన్‌పల్లిలో 3,700 కోళ్లు మృత్యువాత
● కోళ్ల ఫారమ్‌ను పరిశీలించిన మండల పశువైద్యాధికారి
● కోడి రక్తం, మలం నమూనాలు ల్యాబ్‌కు..
కౌడిపల్లి(నర్సాపూర్): ఏం రోగమొస్తుందో తెలియదుకాని కోళ్లు వేలల్లో మృత్యువాత పడుతున్నాయి. గతవారం కంచన్‌పల్లిలో 8 వేలు, పాంపల్లిలో మూడు వేలు కోళ్లు మృతి చెందగా, సోమవారం మరోసారి కంచన్‌పల్లిలోని రైతు రామక్రిష్ణాగౌడ్ కోళ్ల ఫారమ్‌లో 3,700 కోళ్లు చనిపోయాయి. దీంతో మండల వైద్యాధికారి ఫర్విన్‌ఫాతిమా కోళ్ల ఫారమ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతు అభ్యర్థన మేరకు చనిపోయిన కోడి రక్తం, మలం నమూనాలను సేకరించగా రైతు రామక్రిష్ణాగౌడ్‌తో సంగారెడ్డిలోని ల్యాబ్‌కు తీసుకువెళ్లాడు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ఏ వ్యాధితో చనిపోయింది చెప్పగలమన్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాధిని ఇప్పుడే నిర్ధారణ చేయలేమని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చనిపోయిన కోళ్లను గుంతతీసి పూడ్చిపెట్టాలన్నారు. కోళ్ల ఫారమ్‌లో కోళ్లు చనిపోతుండటంతో కంపెనీ యాజమాన్యం దానా పంపడంలేదని దీంతో దాణా లేకపోడం, ఎండ వేడిమికి సైతం కోళ్లు చనిపోయే ఆస్కారం ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment