
వరికి బదులు మొక్కజొన్న వేసుకోవాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): వరితో పోల్చుకుంటే మొక్కజొన్న పంట కాలం తక్కువ, నికర ఆదాయం అధికమని వ్యవసాయ పరిశోధన కేంద్రం డాక్టర్ శ్రావణి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి అన్నారు. అక్కన్నపేట మండలం చౌటకుంట తండాలో మంగళవారం ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన తోర్నాల ఆధ్వర్యంలో మొక్కజొన్న చిరుసంచులైన కేఎన్‌ఎంహెచ్–4191 హైబ్రిడ్ రకంను రైతుల పొలంలో క్షేత్ర ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ రకం మొక్కజొన్న హైబ్రీడ్ నీటి ఎద్దడిని, ఎండు తెగులను తట్టుకోవడమే గాక యాసంగి కాలానికి అనుకూలమైనవని అన్నారు. అదే విధంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో పడే వడగండ్ల నుంచి కూడా రైతులు పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. చీడపీడలను తట్టుకొని, వర్షాభావ పరిస్థితుల్లో కూడా రైతులకి మంచి దిగుబడులను అందజేస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తాన, వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment