
జొన్న.. లాభాలు మిన్న
జహీరాబాద్ టౌన్: చిరు ధాన్యాల పంటల్లో అత్యధికంగా పండించే పంటల్లో జొన్న ఒకటి. కార్బొహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న ప్రజాధరణ పొందింది. ఒకప్పుడు పల్లెల్లో విరివిగా కాసిన జొన్న పంట కాలక్రమంలో తగ్గిపోయింది. ప్రజలు జొన్న రొట్టెలు తినడం ప్రారంభించడంతో మళ్లీ డిమాండ్ పెరిగింది. (తెల్ల) జొన్న ఆహారపు అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెల్ల జొన్నకు మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. గిట్టుబాటు ధర కూడా లభిస్తుండడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు జొన్న పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గంలో రబీలో జొన్న అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. జిల్లాకు సరిహద్దులో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో కూడా ఈ పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. జొన్న సాగుకు నల్లరేగడి నేలలు లేదా తేలిక పాటి ఎర్ర చల్క నేలలను శ్రేయస్కరం. రబీలో పండించే జొన్న వర్షాధారిత పంట కాదు. గాలిలోని తేమ ద్వారానే పంట పండుతుంది. జొన్నకు తెగుళ్ల బెడద తక్కువే. ఇతర పంటల మాదిరిగా ఆశించినంతగా ఉండదు. నెమళ్లు, అడవి పందుల బెడద ఉంటుంది. వాటి నుంచి రక్షించుకునేందుకు కష్టపడితే చాలు. జిల్లాలో గతేడాది జొన్న పంట సుమారు 35 వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది సుమారు 42 వేల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాల్‌కు రూ. 6 వేల వరకు పలుకుతుంది. ఎకరాలకు సగటున 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. కొనుగోళ్ల కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంటను కొనడం వల్ల రైతులకు పంట అమ్మడానికి ఇబ్బందులు ఉండవు.
పెరిగిన సాగు విస్తీర్ణం
జిల్లా వ్యాప్తంగా సుమారు 42 వేల ఎకరాల్లో సాగు
మార్కెట్‌లో మంచి డిమాండ్
క్వింటాల్‌కు రూ.6 వేలు
Comments
Please login to add a commentAdd a comment