ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి
జిల్లా వ్యవసాయాధికారి రాధిక
కొండపాక(గజ్వేల్): యాసంగిలో నీటి అవసరాలు తక్కువగా ఉండే పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి టీ.రాధిక పేర్కొన్నారు. కొండపాకలో కూరగాయలు, పొద్దు తిరుగుడు, వరి పంటలు సందర్శన చేశారు. భూగర్భజలాలు విపరీతంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయన్న విషయాన్ని రైతులు వ్యవసాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతూ ట్యాంకర్ల ద్వారా నీటి తడులను అందించుకుంటూ కాపాడుకుంటున్నామంటూ కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. యాసంగిలో తక్కువ పెట్టుబడులతో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేసుకుంటూ లాభపడాలన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు నీరు విడుదల చేసేలా వ్వయసాయ శాఖ కృషి చేస్తుందన్నా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణ, జిల్లా రైతు కమిటీ కార్యదర్శి దొమ్మాట మహిపాల్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్‌రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు బైండోవర్
శివ్వంపేట(నర్సాపూర్) : జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని తహసీల్దార్ ఎదుట పోలీసులు మంగళవారం బైండోవర్ చేశారు. మండల పరిధి చండీ గ్రామానికి చెందిన ఆంజనేయులు ట్రాక్టర్‌ను ఇంటి ఎదుట పార్కింగ్ చేశాడు. సోమవారం అర్థరాత్రి గ్రామానికి చెందిన మియ్యడి రాములు, మియ్యడి శేఖర్, సందిగాని వినయ్ ట్రాక్టర్ డాబర్ పట్టీలు చోరీ చేస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముగ్గురూ మద్యం మత్తులో చిల్లర దొంగతనాలకు అలవాటు పడటంతో మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇచ్చి తహసీల్దార్ కమలాద్రి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు.
తిరుగులేని శక్తిగా
భారతి సిమెంట్
టెక్నికల్ మేనేజర్ సునీల్
గజ్వేల్‌రూరల్: సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా వికాట్ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్ నిలిచిందని, అంతేకాక ఆల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్‌ను తెలంగాణాలో విడుదల చేసినట్టు ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ తెలిపారు. శ్రీమాత ట్రేడర్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికాట్ గ్రూప్ కంపెనీలు 13 దేశాలలో విస్తరించి ఉన్నాయన్నారు. ఈ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవడంతో పాటు నిర్మాణం ధృడంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలతో పాటు రహదారులకు సరైన ఎంపిక అని, నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ సతీశ్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి తిరుపతి, టెక్నికల్ అధికారి శ్రీకాంత్, శ్రీమాత ట్రేడర్స్ డీలర్ బాలన్‌రావు, గణేశ్, రమేశ్‌తో పాటు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి
Comments
Please login to add a commentAdd a comment