వైన్ షాప్ పర్మిట్ రూంలు బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. జిల్లాలో 93 మద్యం దుకాణాలున్నాయి. నిబంధనల ప్రకారం పర్మిట్ రూంలో మద్యం తాగడానికి గ్లాసులు, వాటర్, ప్యాకింగ్ చేసిన తినుబండరాలు మాత్రమే విక్రయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని పర్మిట్ రూంలలో ఆహార పదార్థాలు విక్రయిస్తూ, వెయిటర్లను ఏర్పాటు చేసి బార్లను తలపించేలా వ్యాపారం చేస్తున్నారు. మద్యం షాపుల యజమానులు నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట: ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా 100 చదరపు మీటర్ల విస్తీర్ణంతో పర్మిట్ రూంను ఏర్పాటు చేసుకోవాలి. కానీ చాలా మద్యం షాపులు ఈ నిబంధనలు పాటించడం లేదు. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పర్మిట్ రూంలో ఒక్క టేబుల్‌ను మాత్రమే ఉండాలి, కానీ 15 నుంచి 20 టేబుళ్లు వేస్తున్నారు. వైన్ షాప్ యజమానులు పర్మిట్ రూంలు మరొకరికి లీజుకు ఇస్తున్నారు. మరికొన్ని షాప్‌లలో ఓపెన్ ఎయిర్‌లలో సైతం సిట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. వైన్ షాప్‌లలో బార్‌లలో ఏర్పాటు చేసినట్లు అర్డర్ తీసుకునేందుకు వెయిటర్లను సైతం ఏర్పాటు చేశారు. మరికొన్ని వైన్ షాప్‌లలో బయటి నుంచి తినుబండరాలు తీసుకరావద్దని బోర్డులను సైతం ఏర్పాటుచేసి, బయట నుంచి తెచ్చుకునేవి లోపలికి తీసుకరానివ్వడం లేదు.
పర్మిట్ రూమ్‌లలో రెడీ టు ఈట్ ఫుడ్ మాత్రమే అనుమతించాలి. కానీ రెస్టారెంట్‌ల మాదిరిగా ఏర్పాటు చేసి చికెన్, మటన్, బోటి, తలకాయ, ఇలా అన్ని రకాల మాంసాహారాన్ని అందిస్తున్నారు. మున్సిపాలిటీలు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నుంచి లైసెన్స్‌లు పొందాలి. పర్మిట్ రూముల్లో విక్రయాలు జరిపే వారికి ఎలాంటి లైసెన్స్‌లు ఉండడం లేదు. ఎకై ్సజ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలు తావిస్తోంది. ఇప్పటికై నా ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోని మద్యం వ్యాపారుల ఆక్రమాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైన్ షాపుల షిఫ్టింగ్..
వైన్ షాప్‌ల షిఫ్టింగ్ కోసం మద్యం వ్యాపారులు దరఖాస్తు చేశారు. దుబ్బాక మండలం హబ్సిపూర్ నుంచి తిమ్మాపూర్‌కు, సిద్దిపేట రూరల్ మండలం రఘవాపూర్ నుంచి ఇర్కోడ్‌కు, అక్కన్నపేట నుంచి గోవర్ధనగిరి, చేర్యాల పట్టణం నుంచి గుర్జకుంటకు, మరొక షాప్ నాగపూరికి షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం పట్టణానికి చెందిన షాప్‌లు పట్టణ పరిధిలోనే మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇతర ప్రాంతాలకు సైతం దరఖాస్తు చేశారు. ఓ అధికారి ప్రోత్సాహంతో దరఖాస్తు చేసినట్లు తెలిసింది. చిన్నకోడూరులో మండల కేంద్రంలో వైన్ షాప్ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేయవద్దని గ్రామ పంచాయతీ పాలక వర్గం వినతి పత్రంను అందించారు. అయినప్పటికీ నివాస గృహాల వద్దనే ఏర్పాటు చేశారు.
చర్యలు తీసుకుంటాం
పర్మిట్ రూంలు 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. స్థల మార్పు కోసం ఐదు దరఖాస్తులు వచ్చాయి. వాటిని కమిషనర్‌కు పంపించాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కొనసాగుతాం.
– శ్రీనివాస మూర్తి, ఈఎస్, ఎకై ్సజ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment