
మాట్లాడుతున్న సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు సేఫ్టీ కమిటీ మెంబర్లు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, రోడ్డు భద్రతా వలంటీర్లు, హెచ్‌కేఆర్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి వాహనాలు నడపాలని సూచించారు. అతివేగం, అజాగ్రత్త, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డుపై ఉన్న 66 గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీ (462 మంది) మెంబర్లను నియమించామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో ట్రాఫిక్, రోడ్డు నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీ ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సిపి సూచించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదం, ఇతర కారణాలవల్ల అపస్మారక స్థితిలోకి వెళ్తే వారిని ఎలా కాపాడాలి అనే విషయంపై 108 సిబ్బంది, మెడికల్ సిబ్బంది సీపీఆర్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రసన్న కుమార్, సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, డీటీఓ లక్ష్మణ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ధరణి కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
అవగాహన కల్పించిన సీపీ అనురాధ
Comments
Please login to add a commentAdd a comment