
బీఆర్‌ఎస్ నిర్లక్ష్యమే కారణం
● వంటేరువి తప్పుడు ఆరోపణలు
● గజ్వేల్ మార్కెట్ కమిటీ
చైర్మన్ నరేందర్‌రెడ్డి
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితులు ఇప్పటికీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం కోల్పోయిన త్యాగ ధనులను బీఆర్‌ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరును అంతా గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నర్సింహారెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, యాదయ్య, మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment