
అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు
సిద్దిపేటకమాన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులు శనివారం కేక్ కట్ చేసి మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించాలని తెలిపారు. మహిళ సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన, కుకింగ్ పోటీల్లో విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, మిలింద్‌కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment