పెద్ద మాసాన్‌పల్లి అడవికి నిప్పు
తొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి అడవికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. అడవి సమీపంలోని వ్యవసాయ బావుల వైపునకు మంటలు వ్యాపించాయి. దీంతో పరిస్థితిని గమనించిన గ్రామస్తులు జిల్లా ఫారెస్ట్ ఇన్‌చార్జి అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకున్నారు. తమ వ్యవసాయ బావుల వద్ద పశువుల పాకలు, పాడిగేదెలు, గడ్డి వాములు ఉన్నాయని సదరు అధికారికి సమస్య విన్న వించారు. ఆలస్యంచేస్తే తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని విన్నవించారు. అయినా సదరు అధికారి స్పందించకుండా ఫోన్ చేసిన గ్రామస్తులపై రుసరుసలాడారు. తనకు ఎందుకు పోన్‌చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారంటూ గ్రామస్తులు తెలిపారు. రేపు ఉదయం చూద్దాంలే అంటూ ఫోన్‌కట్‌చేశాడని వారు తెలిపారు. ఇక ఆలస్యంచేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదముందంటూ యువకులు మంటలు ఆర్పేందుకు తరలివెళ్లారు. ఈదురు గాలులు వ్యాపించడంతో మంటలు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో గ్రామస్తులకు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున అడవికి తరలివచ్చారు. వ్యవసాయ బావుల నుంచి పైపుల ద్వారా ఎంతో శ్రమించి మంటలు ఆర్పివేశారు. అడవికి నిప్పంటుకుందని సమాచారం ఇచ్చినా స్పందించని జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
స్పందించని ఫారెస్ట్ ఉన్నతాధికారి
గ్రామస్తులే మంటలు ఆర్పిన వైనం
Comments
Please login to add a commentAdd a comment