
రంగరాజన్‌నుపరామర్శించిన బ్రాహ్మణులు
గజ్వేల్‌రూరల్: చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌ను గజ్వేల్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్చకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిందితులను పట్టుకొని శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు దేశపతి శంకరశర్మ, రవీందర్‌రావు, విఠాలకృష్ణమూర్తిశర్మ, నందబాలశర్మ, సాయికృష్ణశర్మ, శ్యాంప్రసాద్‌శర్మ, రఘు మురళీమోహనశర్మ, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్‌కునీటి పంపింగ్
కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటి పంపింగ్‌ను అధికారులు ప్రారంభించారు. జనగామతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సాగు నీరు అందించే తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గింది. దీంతో మంగళవారం అధికారులు బొమ్మకూరు రిజర్వాయర్‌నుంచి పంపింగ్ చేపట్టారు. దీంతో పరిసర గ్రామాల రైతులు హర్షం వక్తం చేస్తున్నారు. గతంలో రిజర్వాయర్ నీటితో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు దూల్మిట్ట, బచ్చన్నపేట మండలాల్లోని చెరువులను నింపేవారు. మారిన రాజకీయ పరిణామాలతో ఈప్రాంతంలోని చెరువులు నిండకముందే భువనగిరి నియోజకవర్గానికి కొంత మంది నాయకులు నీరు తరలించండంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఈప్రాంత చెరువులు పూర్తిగా నింపేందుకు అధికారులు, రాజకీయ నాయకులు కృషిచేయాలని రైతులు కోరుతున్నారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
డీఎంహెచ్‌ఓ పాల్వాన్ కుమార్
దుబ్బాకటౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ పాల్వాన్ కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ప్రజలకు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూఅందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాచేస్తే చర్యలు: సీపీ
సిద్దిపేటకమాన్: అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 87126 67100కు సమాచారం అందించాలన్నారు.

రంగరాజన్‌నుపరామర్శించిన బ్రాహ్మణులు
Comments
Please login to add a commentAdd a comment