
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థినులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, లైబ్రరీని పరిశీలించి కళాశాల వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫస్టియర్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్‌కు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థినులు కంప్యూటర్ విద్యను శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్‌కుమార్ కళాశాల ఆవరణను కలెక్టర్‌కు చూపించారు. మొత్తం 325 మంది విద్యార్థినులు చదువుతున్నారని, తరగతి గదులు సరిపోవడం లేదన్నారు. స్పందించిన కలెక్టర్ కళాశాల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
ఎఫ్‌పీఓలను బలోపేతం చేయండి
సిద్దిపేటఅర్బన్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనేజేషన్ (ఎఫ్‌పీఓ)లను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న క్రిషి కల్ప అధికారులతో, ఎఫ్‌పీఓల సీఈఓ, డైరెక్టర్‌లతో మంగళవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రిషి కల్ప సీఈఓ పాటిల్ ఎఫ్‌పీఓలు బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సాహం అందించాలని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ విద్యార్థులకు మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించి వాటిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్రిషి కల్ప అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏఓ రాధిక, డీహె చ్‌ఓ సువర్ణ, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరి
Comments
Please login to add a commentAdd a comment