● ఉమ్మడి మెదక్ నుంచి 27 మంది నామినేషన్లు ● పట్టభద్రుల ఎమ్మెల్సీకి 22 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఐదుగురు ● రేపటి వరకు ఉపసంహరణ గడువు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో77వేల మంది ఓటర్లు
సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వంద మంది నామినేషన్లు వేయగా అందులో ఉమ్మడి మెదక్ నుంచి 22 మంది ఉన్నారు. అందులో సంగారెడ్డి జిల్లా నుంచి 11 మంది, సిద్దిపేట నుంచి 9, మెదక్ నుంచి ఇద్దరు ఉన్నారు. బీజేపీ నుంచి అంజిరెడ్డి (రామచంద్రాపురం, సంగారెడ్డి), ఇండిపెండెంట్లుగా పిడిశెట్టి రాజు (కోహెడ, సిద్దిపేట), చంద్రశేఖర్ (కంది, సంగారెడ్డి), దొడ్ల వెంకటేశం (సదాశివపేట్, సంగారెడ్డి), ఎన్ చంద్రశేఖర్ (మెదక్), దేవునూరి రవీందర్ (భరత్‌నగర్, సిద్దిపేట), మంద జ్యోతి (శ్రీనివాసనగర్, సిద్దిపేట), గుమ్మడి శ్రీశైలం (పెద్దలింగారెడ్డిపల్లి, సిద్దిపేట), సంజీవులు (కంది, సంగారెడ్డి), బెజుగం వెంకటేష్ (హౌసింగ్‌బోర్డు కాలనీ, సిద్దిపేట) నామినేషన్లు వేశారు. అలాగే వెంకటేశ్వర్లు (పటాన్‌చెరు, సంగారెడ్డి), సాయిబాబా (తూప్రాన్, మెదక్), మచ్చ శ్రీనివాస్ (దుబ్బాక, సిద్దిపేట), ఎన్.యాదగిరి (ఆర్సీపురం, సంగారెడ్డి), గిరిధర్ (మంజీరానగర్, సంగారెడ్డి), ఇంద్రాగౌడ్ (మర్కూక్, సిద్దిపేట), శంకర్ రావు (పటాన్‌చెరు, సంగారెడ్డి) , సత్యనారాయణగౌడ్ (సదాశివపేట, సంగారెడ్డి), లక్ష్మీప్రసన్న (పటాన్‌చెరు, సంగారెడ్డి), నరేందర్ రెడ్డి (జహీరాబాద్, సంగారెడ్డి), ఆంజనేయులు (నంగనూరు, సిద్దిపేట), పోచబోయిన శ్రీహరి యాదవ్ (చిన్నకోడూరు, సిద్దిపేట) నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి..
ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు వేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి(చిన్న కోడూరు, సిద్దిపేట), పీఆర్‌టీయూ నుంచి వంగ మహేందర్ రెడ్డి (ప్రశాంత్‌నగర్, సిద్దిపేట) మామిడి సుధాకర్ రెడ్డి (టేక్మాల్, మెదక్), అశోక్ కుమార్ ( కొండాపూర్, సంగారెడ్డి), జగ్గు మల్లారెడ్డి (మోయిన్‌పూర, సిద్దిపేట) నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే నామినేషన్లు వేసిన వారిలో ఎనిమిది మందివి తిరస్కరణకు గురయ్యాయి.
ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో..
ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గ్రూపులుగా డిన్నర్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. తనను గెలిపిస్తే విద్యా అభివృద్ధికి, నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీలు గుప్పిస్తున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు గురువారం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో ఎవరు పోటీలో ఉంటారో తేలనుంది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌటింగ్‌చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment