
పెండింగ్ పనులు పూర్తి చేయండి
నంగునూరు(సిద్దిపేట): పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంగునూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పెండింగ్ పనులపై ఆరా తీశారు. మండలంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చే వినతులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ సరిత, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐ లింగం, జయసూర్య పాల్గొన్నారు.
వంద శాతం పన్నులు వసూలు చేయాలి
హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ అధికారి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం అస్తి పన్ను వసూలు చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, వాటర్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్ష కార్యక్రమానికి హుస్నాబాద్ మున్సిపాలిటీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మేనేజర్ భూమానందం, ఏఈ మహేష్, జేఏఓ ఆరతి, ఆర్‌ఐ కనకయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
హుస్నాబాద్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. మంగళవారం ఐఓసీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ తరగతులను డీపీఓ దేవకీదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
Comments
Please login to add a commentAdd a comment