
హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం
దుబ్బాకటౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని ఆర్య వైశ్య భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, చదువుకున్న యువతీ, యువకులు బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ ఉత్తమ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల తరఫున పోటీ చేస్తున్న అంజిరెడ్డి, ఉపాధ్యాయుల తరపున కొమురయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించి, బీజేపీ సత్తాను మరోసారి చాటాలన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట, సంగారెడ్డి బీజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, గోదావరి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు తదితరులున్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment