సిద్దిపేటజోన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితా శనివారం విడుదల కానుంది. ఈ మేరకు శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ రమేష్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా మేరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించారు. డ్రాఫ్ట్ జాబితా మేరకు 230 ఎంపీటీసీల స్థానాలకు సంబంధించి 1293 పోలింగ్ కేంద్రాల గుర్తింపు పై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెరిగిన మూడు జెడ్పీటీసీ స్థానాలకు అనుగుణంగా ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మోహన్ లాల్(బీఆర్‌ఎస్), వెంకట్(బీఎస్పీ) రవి(సీపీఎం), కల్యాణ్(బీజేపీ)తో పాటు నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment