
రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి
గజ్వేల్‌రూరల్: రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో మనుషుల ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. పట్టణంలోని వేంకటేశ్వరాలయ ప్రాంగణం వద్ద శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడిన వాళ్లమవుతామని అన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, ఐఎంఏ గజ్వేల్ అధ్యక్షులు నాగమున్నయ్య, వైద్యులు నరేష్‌బాబు, లింగం, ఆలయ పూజారి శేషం శ్రీనివాసచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment