
రాష్ట్రస్థాయికి మూడు ప్రాజెక్టులు ఎంపిక
పర్యవేక్షకులు, విద్యార్థులకు అభినందనలు
దుబ్బాక: కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి 14 విభాగాల్లో 1047 ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళశాల నుంచి ఆరు ప్రాజెక్టులు రాగా 3 ప్రాజెక్టులు ఎంపిక కావడం విశేషం. వృక్షశాస్త్రం విభాగం నుంచి డాక్టర్ స్వాతి పర్యవేక్షణలో ఫెసిలిటేటెడ్ ఫారెస్టు రీజనరేషన్ ఇన్ దుబ్బాక్ రిజర్వ్ ఫారెస్ట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం నుంచి ఆంజనేయులు, పర్యవేక్షణలో నెగోషియేషన్ ఇన్ కామర్స్ అండ్ స్టడీ టెక్స్‌టైల్ అండ్ ఓకల్ ఇంటరాక్షన్ తెలుగు విభాగంలో డాక్టర్ వెంకటేష్ , నాగరాజు.. పర్యవేక్షణలో నేటి యువతరంలో తెలంగాణ భాష అనే ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులకు మార్చి 5,6 తేదీల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ప్రాజెక్టులు ఎంపిక కావడంపై కళాశాలలో ప్రిన్సిపాల్ భవాని, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంసుందర్, జిజ్ఞాస కో ఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి పర్యవేక్షకులు, విద్యార్థులను అభినందించారు.
ప్రాక్టికల్స్ పరీక్షల పరిశీలన
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరీక్షలను శనివారం సిద్దిపేట డీఐఈఓ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగే పరీక్షలను ఇంటర్మీడియట్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసేలా కమిషనర్ నియంత్రించినట్లు తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రాక్టికల్స్, పరీక్షలను విద్యార్థులు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు గంగాధర్, ప్రిన్సిపాల్ దేవస్వామి తదితరులు పాల్గొన్నారు.
కరాటే గ్రేడింగ్ పరీక్షలు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేటలోగల సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో కోచ్‌లు శ్రీనివాస్, రజిత ఆధ్వర్యంలో శనివారం కరాటే గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బెల్ట్‌లను సాధించారని వారు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టెక్నికల్ ఎక్సామినర్ పాపా య్య, ప్రిన్సిపాల్ షాలిని పాల్గొన్నారు.
రామయ్య పంతులు
సేవలు మరువలేనివి
జగదేవ్‌పూర్(గజ్వేల్): జగదేవ్‌పూర్ గాంధీ, మాజీ సర్పంచ్ దివంగత నరసింహరామయ్య పంతులు సేవలు మరువలేనివని ఏఎన్‌ఆర్ పీపుల్స్ ట్రస్టు చైర్మన్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్‌శర్మ అన్నారు. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగదేవ్‌పూర్‌ను మండలంగా చేసేందుకు ఎంతో కృషిచేశారని, ప్రజాసేవకుడిగా ప్రజల్లో నిలిచిపోయారని తెలిపారు. వివిధ పార్టీల నాయకులు మహేందర్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కనకయ్య, ఇక్బాల్, శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయికి మూడు ప్రాజెక్టులు ఎంపిక

రాష్ట్రస్థాయికి మూడు ప్రాజెక్టులు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment