
కడియం శ్రీహరి పరామర్శ
చేర్యాల(సిద్దిపేట): స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ నాయకురాలు సింగాపురం ఇందిర అన్నయ్య కర్రొల్ల భాస్కర్ ఈ నెల 14న మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం పట్టణకేంద్రానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయనవెంట మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి తదితరులున్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లాఅధ్యక్షుడి సస్పెన్షన్
గజ్వేల్: ఎమ్మార్పీఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణమాదిగ, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శనిగరి రమేశ్‌మాదిగలను సస్పెండ్ చేసినట్లు ఆ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి కోళ్ల శివమాదిగ ప్రకటించారు. ఆదివారం గజ్వేల్ అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈనేపథ్యంలోనే వారిపై జరిపి, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌మాదిగ, సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు
బోనాలతో స్వాగతం
కొండపాక(గజ్వేల్): ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా కుకునూరుపల్లిలోని తెలంగాణా తల్లి విగ్రహానికి కవిత పూల మాల వేసి జై తెలంగాణా, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి రాజీవ్ రహదారిపై ఉన్న రవీంద్రనగర్ చౌరస్తా వద్దకు కవిత చేరుకోగానే మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సిద్దిపేటకు వెళ్లారు. కవిత రాకతో ట్రాఫిక్‌కు 20నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.
ఉప కాల్వ ద్వారా
సాగు నీరు అందించండి
మిరుదొడ్డి(దుబ్బాక): దుబ్బాక పట్టణ శివారులో ఉన్న సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములకు మల్లన్న సాగర్ ఉప కాల్వ ద్వారా సాగు నీటిని అందించాలని రైతులు కోరారు. ఈమేరకు అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు ఆదివారం రైతులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో దుబ్బాక బాబూ జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు రాజమల్లు, ఉపాధ్యక్షుడు జోగయ్య, కోషాధికారి యాదగిరి, రైతులు పాల్గొన్నారు.
కాలి బూడిదైన ఈత చెట్లు
గజ్వేల్‌రూరల్: ఈత చెట్లను దహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదీపూర్‌కు చెందిన గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద 500 ఈత చెట్లను పెంచి వాటి ద్వారా ఉపాధి పొందుతున్నామన్నారు. ఈ క్రమంలో ఆదివారం 40 చెట్ల వరకు కాలిపోయినట్లు సంఘం సభ్యులు గుర్తించారని, ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కడియం

కడియం శ్రీహరి పరామర్శ

కడియం శ్రీహరి పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment