‘పాత పెన్షన్’ అమలుకు పోరాటం
సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పాత పెన్షన్ విధానం అమలుకు పోరాడుదామని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయ్ యూనియన్(టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూపీఎస్ స్కీం ను వ్యతిరేకిస్తూ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ సీపీఎస్, యూపీఎస్‌ల రద్దుకు అందరం కలిసికట్టుగా పోరాడుదామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం హామీని నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను అమలు చేయాలన్నారు. పాత పెన్షన్ అమలయ్యేదాకా పోరాటమే తమ ఏకై క ఎజెండా అని అన్నారు. అందరం ఏకమై సీపీఎస్, యూపీఎస్ పై వ్యతిరేకంగా పోరాడితే పాత పెన్షన్ విధానం అమల్లోకి వచ్చితీరుతుందన్నారు. సీపీఎస్, యూపీఎస్‌లకు వ్యతిరేకంగా మార్చి 2న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే యుద్ధభేరి ని విజయవంతం చేయాలన్నారు.కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు చేగూరి దేవరాజ్, ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, జగదీష్, ప్రవీణ్, సీపీఎస్ సంఘ సభ్యులు, ఉద్యోగ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment