మృత్యువులోనూ వీడని స్నేహం
● కల్లు తాగేందుకు వచ్చి ఈతకు వెళ్లిన యువకులు ● ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి ● జిన్నారం మండలంలోని వావిలాల పీర్ష చెరువు వద్ద ఘటన
జిన్నారం (పటాన్‌చెరు): చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగలక్ష్మి కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన వల్లపు రాంబాబు కుమారుడు నరేశ్(26), వల్లపోలు రాజు కుమారుడు శంకర్ (22) ఇద్దరూ స్నేహితులు కాగా కూలీ పని చేస్తుంటారు. మంగళవారం సాయంత్రం జిన్నారం మండలం వావిలాలలో కల్లు తాగేందుకు స్క్యూటీ పై వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో ఈత కొట్టేందుకు వావిలాల పీర్ష చెరువులోకి దిగారు. చెరువు ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. అక్కడే గేదెలు మేపే ఓ వ్యక్తి గమనించి చెరువులో దిగి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వెంటనే పోలీసులకు విషయం చెప్పాడు. బుధవారం జగంపేట వావిలాల గ్రామాలకు చెందిన ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
Comments
Please login to add a commentAdd a comment