గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో దుద్దెడ నుంచి జక్కాపూర్ వరకు 31 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 21 కిలోమీటర్ల నూతన రోడ్డు కోసం భూమిని సేకరించనున్నారు. పంట పొలాల మీదుగా రోడ్డు ఉండనుంది. మొత్తంగా పాత రోడ్డును 10 కిలోమీటర్లు విస్తరిస్తూ 21 కిలోమీటర్లు నూతన రోడ్డు కోసం సుమారు 210 హెక్టార్ల భూమిని రైతులు కోల్పోతున్నారు. భూమి సేకరణ దిశగా జాతీయ రహదారుల అధికారులు చర్యలు చేపడుతున్నారు. దుద్దెడ, జప్తినాచారం, నాగిరెడ్డిపల్లి, మార్పడగ, కంభంపల్లి, ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి, బూర్గుపల్లి, ఇర్కోడ్, చిన్నగుండవెల్లి, రాఘవాపూర్, పుల్లూరు, మల్యాల, జక్కాపూర్ మీదుగా జాతీయ రహదారి సాగనుంది. ఇందుకు భూ సర్వే చేస్తున్నారు.
నష్టపోతున్న రైతులు
150 ఫీట్ల రోడ్డుతో ఫోర్‌లేన్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. జనగామ నుంచి దుద్దెడ వరకు 100 ఫీట్ల వెడల్పుతో ఉన్న రోడ్డును దుద్దెడ నుంచి జక్కాపూర్ వరకు 150ఫీట్లకు పెంచారు. దీంతో కొందరు రైతులు మొత్తం భూమిని కోల్పోతుండగా మరి కొందరు సగం కంటే ఎక్కువగా నష్టపోనున్నారు. కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్న భూమి దక్కకుండా పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే పలు చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అనుబంధంగా కొత్త రోడ్డు కోసం భూ సేకరణ చేస్తుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు.
న్యూస్‌రీల్
365బీ జాతీయ రహదారి విస్తరణపై రైతుల గగ్గోలు
భూమిపోతే ‘రోడ్డు’న పడతాం అంటూ ఆవేదన వంద ఫీట్లకే కుదించాలంటూ వినతులు బహిరంగ మార్కెట్ ధర చెల్లించాల్సిందేనంటూ పట్టు ఇప్పటికే పలుచోట్ల సర్వే అడ్డగింత జిల్లాలో దుద్దెడ నుంచి జక్కాపూర్ వరకు నిర్మాణం
బహిరంగ మార్కెట్ ధర చెల్లించాల్సిందే..
జాతీయ రహదారి వెళ్లే మార్గంలో గతంలోనే బహిరంగ మార్కెట్ ధర ఎకరానికి రూ.45 లక్షల నుంచి రూ.60లక్షలు ఉంది. కానీ ప్రభుత్వం భూ సేకరణకు ఎకరానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో రైతులు ఒక్కో ఎకరానికి లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బహిరంగమార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
‘ఎవుసమే మా ప్రాణం.. ఏళ్లుగా భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం.. మా భూములు లాక్కోవద్దు.. విస్తరణ పేరుతో ‘రోడ్డు’న పడేయవద్దు..’ అంటూ రైతులు వేడుకుంటున్నారు. కొన్ని చోట్ల సర్వేకు వచ్చిన అధికారులను సైతం అడ్డుకుంటున్నారు. 365బీ జాతీయ రహదారి విస్తరణపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 365 బీ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఇందుకోసం రూ.1,100 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే పలు చోట్ల సర్వేను నిర్వహించి మార్కింగ్ చేశారు. జనగామ నుంచి దుద్దెడ వరకు 100ఫీట్లు ఉన్న మాదిరిగానే సిరిసిల్ల వరకు కూడా అలాగే విస్తరించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 31 కిలో మీటర్ల మేర (దుద్దెడ నుంచి జక్కాపూర్) నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment