శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
జయంతి వేడుకల్లో వక్తలు
సిద్దిపేటజోన్: యువత ఛత్రపతి శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ మాట్లాడారు. ప్రతి వ్యక్తి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతకుముందు అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేద్దామన్నారు. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది మన భారతదేశమన్నారు. శివాజీ పోరాట పటిమ నేర్చుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా దేశాలు తమ సైనికులకు చెబుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్. జిల్లా హిందూ వాహిని అధ్యక్షుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
Comments
Please login to add a commentAdd a comment