కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
గజ్వేల్: కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేద, బడుగువర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడాలేనివిధంగా కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. వర్గీకరణ ద్వారా ఎస్సీల్లో అట్టడుగున నిలిచిన వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సముచిత న్యాయం చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, గజ్వేల్ నియెజకవర్గ శాఖ అధ్యక్షుడు అజహర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment