
గొర్రెలు, మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గొర్రెలు, మేకలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నీరజ్‌కుమార్ ఇంచురే(21), మాఖన్ విశాల్‌సింగ్(22), రాహుల్, బాబు నలుగురూ గొర్రెలు, మేకలను అపహరించడమే లక్ష్యంగా ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 24న దిల్‌సుఖ్‌నగర్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చీర్ల మల్లేశంకు చెందిన మేకల దొడ్డిలో 4 మేకలను అపహరించారు. కారులో వేసుకొని హైదరాబాద్‌లోని జియాగూడలో విక్రయించారు. రెండ్రోలకు 26న తొగుట సమీప రాంపూర్‌లో 4 గొర్రెలు అపహరించి విక్రయించారు. బాధితుడు చీర్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గౌరారం హోటల్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులు నీరజ్‌కుమార్ ఇంచురే, మాఖన్ విశాల్‌సింగ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీ ఘటనలు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కౌడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. ఇటీవల మండలంలోని రాజిపేట శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో చోరీ జరుగగా కేసు నమోదు చేశాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. గురువారం కౌడిపల్లి శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని దేవులతండాకు చెందిన విస్లావత్ ప్రేమ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆలయంలో రూ.2 వేలు నగదు, రోల్డ్‌గోల్డ్, వెండి అభరణాలు చోరీ చేయగా దీంతోపాటు శివ్వంపేట మండల కొత్తపేట్ ఎల్లమ్మగుడి, చండీలోని ఆలయం, నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని మల్లన్నగుడిలో సైతం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.