
భూ భారతితో సమస్యల పరిష్కారం
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎదైన భూ సమస్య ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీల్డ్ ఎంక్వయిరీ, ఇరువర్గాలను పిలిచి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్ పరిశీలనచేసి నిర్ణీత కాలంలో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో జరగుతాయని వివరించారు. అలాగే అన్ని వివరాలతో కూడిని భూఆధార్ కార్డును రైతులకు అందించన్నుట్లు తెలిపారు. దీంతో భూఅక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు అనంతరం దూల్మిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అధికారులతో కలసి సందర్శించారు. కొంత కాలంగా మూసి ఉన్న వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహానికి కావల్సిన మౌలిక వసతులు వెంటనే కల్పించి వచ్చే విద్యాసంవత్సరం అరంభం నాటికి వసతి గృహాన్ని పునఃప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
అత్యంత పారదర్శకంగా అమలు
కలెక్టర్ మనుచౌదరి