
యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
గజ్వేల్: యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకమని డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్‌లో శనివారం నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు బోధనల ప్రాధాన్యాన్ని చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, కార్యక్రమ నిర్వాహకులు రూబెన్, బాపురెడ్డి, ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సమీర్, మొనగారి రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో ర్యాలీ
హుస్నాబాద్: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో క్రైస్తవులు, పాస్టర్లు, ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ల కమిటీ అధ్యక్షుడు సాల్మన్ రాజ్, మలాకీ, రత్నకుమార్, ఇస్సాక్, తిమోతి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.