
కరోనా మహమ్మారి తర్వాత ఇంకా రెస్టారెంట్లకు వెళ్ళని వ్యక్తులు ఉన్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఉండటం ఎందుకని హోటల్స్‌కు వెళ్లడం లేదు. అలాంటి వారు రోడ్డు పక్కన ఉండే ఫుడ్ ట్రక్ మెనూని మాత్రం ఇష్టంగా ఎంచుకుంటున్నారు. అయితే, మిగతా దేశాల మాటెలా ఉన్నా న్యూయార్క్ నగరంలోని ఈ ఫుడ్ ట్రక్ మాత్రం కుక్కలకు మాత్రమే ఆహారాన్ని అందిస్తోంది. ఈ ట్రక్కును 2017లో వాడుకలోకి తీసుకువచ్చారు. దీని పేరు ‘వూఫ్ బౌల్.’ ఇక్కడ వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్‌ను కుక్కలకు యమాటేస్టీగా వండి వడ్డిస్తారు. కుక్కకి స్నేహపూర్వక, ఆరోగ్యకరమైన ఆహారాన్ని వూఫ్ బౌల్ ద్వారా అందించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ ట్రక్ యజమాని ఇక్కడ కుక్కల కోసం సేంద్రీయ ఆహారాన్ని మాత్రమే తయారు చేస్తుందని, ఎలాంటి హానికారక రసాయనాలు ఉపయోగించరని ముందే తమ నోట్‌లో పేర్కొంటారు. ఇక్కడ తయారు చేసిన ప్రతిదీ కుక్కలు లొట్టలు వేసుకొని మరీ టేస్ట్ చేస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment