
హిందీ, బెంగాలీ, అస్సామీ, కొరియన్, జపనీస్, ఇంగ్లీష్... ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడుతూ నెటిజనుల చేత ‘వావ్’ అనిపిస్తోంది కంటెంట్ క్రియేటర్ కృతి. జపాన్‌లో ఉంటున్న కృతి జపనీస్ కల్చర్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తుంటుంది.
‘మల్టీలింగ్వల్ ఇండియన్ గర్ల్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 14.1 మిలియన్‌లు అంటే కోటీ నలభై ఒక్క లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఒక్క భాష నేర్చుకోవడానికే ఆపపోపాలు పడుతుంటాం. అలాంటిది చిన్న వయసులోనే కృతి ఆరు భాషలు అవలీలగా మాట్లాడడం అపూర్వంగా ఉంది’ అంటూ నెటిజనులు స్పందించారు.
ఇద్దరు సౌత్ కొరియన్ కంటెంట్ క్రియేటర్‌లు బెంగాలీ బేషుగ్గా మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఆ ఇద్దరిలో ఒకరు హోటల్‌లో పనిచేస్తాడు. హోటల్‌కు వచ్చే బెంగాలీ గెస్ట్‌ల సహాయంతో ఆ భాష నేర్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment