సాధారణంగా మహిళలు చీరలు ధరించి డాన్స్‌లు, పరుగెత్తటం వంటివి చేయడానికే కొంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా చీరకట్టుతో నృత్యం చేయాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన డాన్సర్ ఎష్నాకుట్టి ఆరు గజాల చీరతో అసాధారణమైన ‘హులా హూప్’ నృత్యం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రసుతం ఆమె చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఎష్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘కొన్ని నెలల నుంచి నా మనసులో చీరతో చేసిన హులా హూప్ డాన్స్ వీడియోలు పోస్ట్ చేయాలని ఉంది. సారీఫ్లో మూవ్‌మెంట్‌లో భాగంగా ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. సారీఫ్లో హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సున్నితమైన మహిళలు సైతం ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సౌకర్యవంతంగా చీరలు ధరించవచ్చు. నేను చీర ధరించి నృత్యం చేయడం పట్ల సంతోషంగా ఉన్నా. హూపర్ల ధరించే చీరలు సాధారణ చీరల కంటే కొంత వైవిధ్యంగా ఉంటాయి. ఈ వైవిధ్యం ప్రపంచ కాళారూపాని ప్రత్యేకను ఇస్తుందని ఆశిస్తున్నా’ ఇని ఆమె కాప్షన్ జత చేశారు.
ఎష్నా కుట్టి తన తల్లి చీర కట్టుకొని, స్పోర్ట్ షూ ధరించి డాన్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోపై సామాన్య నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘ఇప్పటి వరకు ఈ వీడియోను చూడటం చాలా ఆలస్యం అయింది. కానీ చాలా ఆశ్చర్యం కలిగించింది’ అని కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment