ముంబై: ఆసియా కప్ నిర్వహణ సందిగ్ధంలో పడినా ... బెట్టు వదిలి పాకిస్తాన్ క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమైంది. అయితే తాము ఆడే మ్యాచ్‌ల వేదికల విషయంలో మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముందు ప్రత్యేక విజ్ఞప్తిని ఉంచింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడుతుంది.
నవంబర్ 19న జరిగే ఫైనల్‌కు కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. భారత్ తమ తొలి పోరులో ఆక్టోబర్7న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉండగా... అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతుంది. అంతర్గత సమాచారం ప్రకారం పాకిస్తాన్ తమ 9 లీగ్ మ్యాచ్‌లను దక్షిణాది వేదికలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోనే ఆడే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ ఫైనల్ చేరితే మాత్రం అహ్మదాబాద్‌లో ఆడక తప్పదు.
వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా అర్హత...
దక్షిణాఫ్రికా జట్టుకు అదృష్టం కలిసొచి్చంది. గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టు ఎట్టకేలకు తమ ప్రమేయం లేకుండానే క్వాలిఫై అయింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఐర్లాండ్‌లో ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ గెలిచి ఉంటే ఆ జట్టుకు అవకాశం దక్కేది.
అయితే ఆ అవకాశం లేకపోవడంతో ఎనిమిదో జట్టుగా సఫారీ బృందం అవకాశం దక్కించుకుంది. మరో రెండు స్థానాల కోసం జూన్–జులైలో జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోరీ్నలో 10 జట్లు తలపడనున్నాయి. ఇందులో మాజీ చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంకలతో పాటు నెదర్లాండ్స్, ఐర్లాండ్, నేపాల్, ఒమన్, స్కాట్లాండ్, యూఏఈ, అమెరికా, జింబాబ్వే ఉన్నాయి.
చదవండి: IPL 2023 CSK Vs DC: జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పుడెమో చుక్కలు చూపిస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment