అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు! | AB De Villiers Shares key advice MS Dhoni before IPL 2026 | Sakshi
Sakshi News home page

అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!

Mar 17 2026 6:17 PM | Updated on Mar 17 2026 6:34 PM

AB De Villiers Shares key advice MS Dhoni before IPL 2026

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బ్రాండ్‌ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్‌ లాంటి ‍క్రికెటర్‌ సీఎస్‌కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్‌కు ఉందని తెలిపాడు. 

‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్‌ అని చెప్పొచ్చు. సీఎస్‌ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో లోయర్‌ ఆర్డర్‌ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్‌తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. 

కానీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయాలని కోరుకుంటున్నా. 

గత సీజన్‌ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 3న ఆర్సీబీతో, ఏప్రిల్‌ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్‌ ఆటగాళ్లకు హెచ్చరిక!

Advertisement
 
Advertisement
Advertisement