పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్‌ ఆటగాళ్లకు హెచ్చరిక! | Australian Players Warned Not To Travel Peshawar City In PSL2026 | Sakshi
Sakshi News home page

PSL 2026: పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్‌ ఆటగాళ్లకు హెచ్చరిక!

Mar 17 2026 5:13 PM | Updated on Mar 17 2026 6:28 PM

Australian Players Warned Not To Travel Peshawar City In PSL2026

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2026 సందిగ్ధంలో పడింది. తాజాగా అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 

ఒకవైపు ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సహా చాలా మంది ఆసీస క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. 

తాజాగా ఆసీస్‌ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది. అయితే పెషావర్‌ జాల్మీ పేరుతో పీఎస్‌ఎల్‌లో ఒక జట్టు ఉండడంతో కచ్చితంగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 

అయితే పాక్‌-ఆఫ్గన్‌ యుద్ధం కారణంగా పెషావర్‌ ప్రస్తుతం ‘నో ట్రావెల్‌ జోన్‌’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్‌లు ఆడేందుకు పెషావర్‌కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు భయపడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 28న పెషావర్‌ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్‌కు పెషావర్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 

పెషావర్‌ జాల్మీ జట్టులోనే ఆరోన్‌ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్‌ ప్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్‌ో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్‌ఎల్‌ సీజన్‌కు తెరలేవనుంది.

చదవండి: ఇరాన్‌ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!

Advertisement
 
Advertisement
Advertisement