భార‌త్‌తో టీ20 సిరీస్ ముంగిట‌ చెల‌రేగిన ఆఫ్గ‌న్ బౌల‌ర్‌ | Afghan-Bowler Mujeeb-Ur-Rahman-Shines-CPL-2026 Ahead-IND-T20-Series | Sakshi
Sakshi News home page

భార‌త్‌తో టీ20 సిరీస్ ముంగిట‌ చెల‌రేగిన ఆఫ్గ‌న్ బౌల‌ర్‌

Sep 7 2026 1:47 PM | Updated on Sep 7 2026 2:12 PM

Afghan-Bowler Mujeeb-Ur-Rahman-Shines-CPL-2026 Ahead-IND-T20-Series

Photo Credit: Twitter

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026లో అఫ్గానిస్తాన్ స్పిన్న‌ర్ ముజీబ్-ఉర్‌-రహ్మాన్ బౌలింగ్‌లో చెల‌రేగ‌డంతో బార్బ‌డోస్ ట్రైడెంట్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా కింగ్స్‌పై విజ‌యాన్ని అందుకుంది. సెప్టెంబ‌ర్ 13 నుంచి అఫ్గానిస్తాన్ జ‌ట్టు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడ‌నున్న‌ నేప‌థ్యంలో ముజీబ్ ఉర్ ర‌హ్మాన్ ఫామ్‌లోకి రావ‌డం ఆ జ‌ట్టు బ‌లాన్ని పెంచ‌డంతో త‌న‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని భార‌త బ్యాట‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు పంపాడు. 

మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 138 పరుగుల సాధార‌ణ స్కోరు చేసింది. క‌మిల్ పూర‌న్ (37) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, రోస్ట‌న్ చేజ్ (34) ప‌ర్వాలేద‌నిపించాడు. బార్బ‌డోస్ బౌల‌ర్ల‌లో ముజీబ్ ఉర్ ర‌హ్మాన్ 3 వికెట్లు తీయ‌గా, డానియ‌ల్ సామ్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన బార్బ‌డోస్ ట్ర‌డెంట్స్ 17.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులు చేసి గెలుపొందింది. క్వింట‌న్ డికాక్ (47 నాటౌట్‌), రివాల్డో క్లార్క్ (36 నాటౌట్‌) అజేయంగా నిలిచి జ‌ట్టును గెలిపించ‌గా, ఓపెన‌ర్లు జాకరీ కార్టర్ (32), బ్రాండ‌న్ కింగ్ (22) రాణించారు. సెయింట్ లూసియా బౌల‌ర్ల‌లో రోస్ట‌న్ చేజ్‌, జాషువా బిష‌ప్‌లు చెరొక వికెట్ తీశారు. మూడు వికెట్ల‌తో మెరిసిన ముజీబ్ ఉర్ ర‌హ్మాన్‌కు "ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు ద‌క్కింది.

ఇక అఫ్గానిస్తాన్, టీమిండియా మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబ‌ర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మ్యాచ్‌ల‌న్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి.

Read: క్వార్ట‌ర్స్‌ చేరిన అల్క‌రాజ్‌కు ఊహించని షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement