న్యూఢిల్లీ: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఓ క్లారిటీ వచ్చింది. గత నెల మార్చిలో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బౌండరీకి వెళ్తున్న బంతిని నిలువరించేందుకు శ్రేయస్ డైవ్ చేయగా.. ఎడమ భుజానికి గాయమైంది. దాంతో ఫిజియో సలహా మేరకు అయ్యర్ వెంటనే మైదానం వీడాడు. ఆ తర్వాత భుజానికి సర్జరీ చేయించుకుని ఐపీఎల్ 2021 సీజన్‌కి కూడా దూరమయ్యాడు.
అయితే తాజాగా శ్రేయస్ అయ్యర్ ఫిట్‌సెస్ పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు.. ‘‘అయ్యర్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తన సత్తా చాటుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మళ్లీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతాడు. అతడు 3 స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతాడు. అప్పుడు మీరు రబాడా, షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్‌తో కలిసి నార్ట్జే పక్కన ఆడవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ నంబర్ 1 స్థానంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ రాక ఆ జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.’’ అని చోప్రా అన్నారు.
అంతేకాకుండా.. ‘‘అహ్మదాబాద్‌లో ఇంగండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భుజానికి గాయం కారణంగా అయ్యర్ ఐపీఎల్ 2021 కి దూరమయ్యాడు. ఆ సమయంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మ్యాన్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్ రద్దు చేయడానికి ముందు పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదింటికి ఆరు గెలిచింది. 12 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ’’ అని ఆకాశ్ చోప్రా అన్నారు.
గత నెల ఏప్రిల్‌లో సర్జరీ చేయించుకున్న శ్రేయస్ అయ్యర్.. మళ్లీ ఎట్టకేలకి జిమ్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం తేలికపాటి ఎక్స్‌ర్‌సైజ్‌లు మాత్రమే చేస్తున్న శ్రేయస్.. పూర్తిగా కోలుకునేందుకు కనీసం 5-6 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment